Article-4




సినిమా  స్క్రిప్ట్ అండ్ స్క్రీన్ ప్లే నాలెడ్జి కి సంబంధించిన 

వీడియోస్ కావాలంటే క్రింది వీడియోస్ చూడండి



Article-4
Realistic fantasy 

ప్రేక్షకుడు నమ్మలేని దాన్ని ..నమ్మించి ..తనదయిన  సినిమా లోకం లో  విహరింప చేయించే వాడికే  గొప్ప పేరు వస్తుంది ..అది స్పిల్ బర్గ్ ..కామెరాన్ , రాఘవేంద్ర రావు , రాజమౌళి ,శంకర్  లకు సాధ్యం అయ్యింది…


టెర్మినేటర్  ...జాస్ ...గొడ్జిల్లా......జురాసిక్ పార్క్ ..అవతార్ ..మాట్రిక్స్ ...హరీ పోట్టర్ ....టి ...ఈగ ..యమదొంగ ..యమగోల ..యమగోల మల్లె మొదలైంది ...మగధీర ...అరుంధతి ...ఆదిత్య 369   టైం మెషిన్ .. రోబో ...నార్నియా ...స్పైడర్ మాన్ ...  Inception……

జగదేక వీరుడు అతిలోక సుందరి ...

ఫై  నున్న సినిమాలు ఒక సారి  గమనించండి ...

 ప్రతి సినిమా లో  ఒక ఫాంటసీ  వుంది ... ఫాంటసీ  పాయింట్ ని మన ప్రపంచంలో  జరిగితే  ఎలా వుంటుంది ..అదే  రియాలిటీ ...

రెండు కలిపినదే  realistic fantasy  movies …

Introduction :

డైరెక్టర్ కి పేరు రావాలన్నా...గుర్తింపు రావాలన్నా ..నిర్మాత కు పెట్టిన దానికి  రెట్టింపు డబ్బు రావాలన్నా  ఇటువంటి సినిమాలకే  బాగా వస్తుంది ..
స్పిల్ బర్గ్.....కామెరాన్ ...రాఘవేంద్ర రావు ..కోడి రామ కృష్ణ ....రాజమౌళి .. ఇలా మంచి పేరు తెచ్చుకున్న వారె ...

Main points to remember :

1. అన్ని కధ లలోను  ఒక వేరే ప్రపంచం  వుంది ..దాన్ని ఎంత బాగా ఆలోచిస్తే ..అన్నో అద్భుతాలు  పెడితే  ప్రేక్షకులు అంతగా నోరెళ్ళ బెట్టి చూస్తారు ...

Examples :Jurrasic park ,Avatar ,E.T,matrix, aditya 369,Terminator ,Robo.

2.తీసుకున్న  ఫాంటసీ పాయింట్ మన ప్రపంచం లో జరిగితే  ఎలా వుంటుంది ? అనే పాయింట్ ని బాగా నమ్మించేలా ప్రయత్నం చేయాలి ..దానికి తగిన క్యారెక్టర్ లు  సృష్టించాలి ..సీన్ లు రాసుకోవాలి ..

Example: Harry potter , ఈగ , జగదేక వీరుడు -అతిలోక సుందరి ,ఆదిత్య369

3. కధల్లో హీరో / హీరోయిన్  ని ఎంత టెన్షన్ పెట్టిస్తే అంత గా సినిమా హిట్ అవుతుంది  .

Examples: అరుంధతి ,మగధీర ,ఈగ ,Robo

4.సాధారణ సినిమా లాగ ఈజీ  గా ప్రతీకారం తీర్చుకుంటే  ఫ్లాప్ అవుతాయి ..

Examples: సుబాష్ చంద్రబోస్
 
5. ఫస్ట్ హాఫ్ లో వున్న ఇంట్రెస్ట్ ..సెకండ్ హాఫ్ లో కూడా వుండాలి ..లేకపోతే స్క్రిప్ట్ పండదు .

Example : బ్రదర్స్ , 7th సెన్స్

6. ఫాంటసీ పాయింట్ ని కధలో అందంగా ఇమడ్చాలి ..లేకపోతే ప్రేక్షకుడికి డౌట్స్ వస్తాయి .
సినిమా ఎగిరి పోతుంది ..

Examples: సుబాష్ చంద్రబోస్
 
7. ఫాంటసీ పాయింట్ త్వరగా చెప్పి , హీరో కి టార్గెట్  కల్పించాలి ..టార్గెట్ లేకపోతే స్క్రిప్ట్ ఫాస్ట్ గా వుండదు .

Examples: 7th సెన్స్

8. కధలో ప్రేమ కధ చాలా నీట్ గా present  చేయాలి ... ప్రేమకధ అవసరం అనుకుంటే ఉంచాలి ..లేకపోతే తీసేయ్యాలి .. ..ఫాంటసీ పాయింట్ కి వన్నె తేవాలి కాని ..నాశనం చేయకూడదు ..

Example : ఈగ , జగదేక వీరుడు -అతిలోక సుందరి

9. చాలా సినిమాల్లో హీరో  ఒక వర్గాన్ని  లేదా  పిల్ల వాడిని  లేదా లోకాన్ని  లేదా హీరోయిన్  ని  కాపాడతారు .

Examples :Terminator ,Robo, matrix,avatar , ఈగ , జగదేక వీరుడు -అతిలోక సుందరి

10..హీరో/హీరోయిన్  తనని తాను రక్షించు కోవడం  కూడా బాగుంటుంది ...

Examples : అరుంధతి , jurrasic park ,Jaws

Advantages:

ఇది "ఎలా సాధ్యం " అని ప్రేక్షకుడు సినిమా హాల్ కి వస్తాడు ..
ఒక ఊహా లోకం  --మన ప్రపంచం లో రియల్ జరుగుతుంటే  అందులో లీనం అవుతాడు ..
“ఏమో జరగవచ్చేమోఅనుకుంటూ చూస్తాడు ..
కొత్త సీన్ లు , కొత్త క్యారెక్టర్ లు  ,అద్భుతాలు ...స్క్రిప్ట్ ని పరుగులు పెట్టిస్తే  "ఏమి జరగబోతుందో " అన్న ఇంట్రెస్ట్ తో చూస్తాడు ..

ప్రేక్షకుడు Expect చేసిన దానికి  ఎన్నింతలు ఎక్కువ త్రిల్ ఇస్తే  సినిమా అంతగా హిట్ అవుతుంది .

Suggestion :

కొత్త డైరెక్టర్స్  స్టార్టింగ్ లోనే ఇటువంటి సబ్జక్ట్స్  తీయకూడదు .. రెండు ,మూడు సినిమా తర్వాత ప్లాన్ చేసుకుంటే మంచిది .. ఎందుకంటే బడ్జెట్  పెద్దగా వుండాలి కదా ...