Artical 6




Realistic +Drama
మన సమాజం (Realistic) లో  కొందరు కుటుంబ వ్యక్తుల మధ్య (Drama)  జరిగే  కధలు
అదే Realistic +Drama ….
బొమ్మరిల్లు ...నువ్వే కావాలి ...ప్రస్థానం ....ఆనలుగురు ...ఖుషి ...హ్యాపీ డేస్
...దిల్ చాహతా హై...ఆనంద్ ..గోదావరి ...నువ్వునాకు నచ్చావ్ ...
Main points :
1. ఇందులో ఒక బంధం కొందరు వ్యక్తుల మధ్య ఏర్పడుతుంది ..వాళ్ళు కుటుంబ వ్యక్తులు  కావొచ్చు ..సమాజం లో వేరు వేరు వ్యక్తులు కావొచ్చు ...వాళ్ళ మధ్య  జరిగే దే డ్రామా అవుతుంది ...ఇది నమ్మసఖ్యం గా వుండాలి ...మనల్ని లీనం చేయాలి ...
Example : బొమ్మరిల్లు ..దళపతి ....ప్రస్థానం ...
2. స్ట్రాంగ్ క్యారెక్టర్ ల వలన  సినిమా లో డ్రామా  వుంటుంది ...అంటే  ఒక క్యారెక్టర్  ఒక విధం గా ఆలోచిస్తే ..మరొక  క్యారెక్టర్  ఇంకొక విధం గా  ఆలోచిస్తుంది ...కాబట్టి  ఘర్షణ (conflict) వస్తుంది ..అప్పుడు స్టొరీ రన్ అవుతుంది .Example:
బొమ్మరిల్లు --ప్రకాష్ రాజ్  కి సిద్దార్థ కి ఒక ఘర్షణ వుంది ..
ఆనంద్ --రాజా  కి కమలిని ముఖర్జీ కి  మధ్య 
ఖుషి --హీరో ,హీరోయిన్  కి మధ్య
ప్రస్థానం --ఫాదర్ ,సన్ (శర్వానంద్ ) కి మధ్య ...
దళపతి --మమ్ముటి ,రజని , కలెక్టర్ ,మదర్  కి మధ్య ....
ఇలా మంచి సినిమా లలో conflict వుంటుంది ...
3. సన్నివేశాలు ,సంఘటనలు ...దానికి  రియాక్షన్స్ ...ఆ పాత్రలు  ఎలా ఫీల్ అవుతాయో ...మాటలు బాగా అలోచించి రాసుకోవాలి ...
Example :ఆ నలుగురు ....ప్రస్థానం ...

4.   ప్రేమ కధ కి ఎటువంటి  ముగుంపు  ఇవ్వాలో ...బాగా ఆలోచించాలి ...
Example :ఖుషి ...,హ్యాపీ డేస్ ....గోదావరి ...

5. సినిమా లో రెండు మూడు  సమస్యలుంటే ..ముందు  ఒక సమస్యని  పరిష్కరించాలి ...తర్వాత రెండవది ...క్లైమాక్స్ లో మూడవది ...ఇలా ప్లాన్ చేసుకోవాలి ...
Example :
బొమ్మరిల్లు లో  రెండు సమస్యలున్నాయి ..సిద్దార్థ ప్రేమ సమస్య ...ఫాదర్ సమస్య ...
ప్రేమ సమస్య  ఇంటర్వెల్ కి తీరిపోతుంది .....ఇంటర్వెల్ తర్వాత "ఇంట్లో వాళ్ళని ..చివరికి క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ ని ఒప్పించడం తో  ఆ సమస్య తీరి పోతుంది ...

6. ప్రేక్షకుడు Expect  చేయని విధం గా  క్యారెక్టర్ ఒకటి అయినా   వుండాలి
ఆ నలుగురు లో ---కోటా శ్రీనివాస రావు ..
గోదావరి లో --సెకండ్ హీరోయిన్ ....
నువ్వునాకు నచ్చావ్  లో --సుహాసిని
ప్రస్థానం లో--సాయి కుమార్

7. ఏ క్యారెక్టర్  లవ్ కి ఎటువంటి ఎండింగ్ ఇవ్వాలి ..ఎలా ఇవ్వాలో ఆలోచించాలి ..అన్నీ పాజిటివ్ గా మిగలవు ...అన్నీ నెగటివ్ గా మిగలవు ...
Example : హ్యాపీ డేస్ ...దిల్ చాహాతా హై...దళపతి ...

8. ఇందులో పూర్తి నమ్మ సఖ్యం గా వుండి..ప్రేక్షకుడు ఐడెంటిఫై చేసుకునే సినిమా లు ఎక్కువ హిట్ అవుతాయి ...దానితో పాటు కొత్తదనం కుడా వుండాలి ....
Example :బొమ్మరిల్లు ...హ్యాపీ డేస్ ...దిల్ చాహతా హై ...

9. ఇటువంటి సినిమా కధ ఆలోచించేటప్పుడు ..ఆ క్యారెక్టర్ ల డిజైన్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి ...అప్పుడే ఆ క్యారెక్టర్ బాధ ,ఫీలింగ్స్ అన్నీ ప్రెజెంట్  చేయగలరు ..మాటలు అలాగే రాసుకోవాలి ...
Example : బొమ్మరిల్లు-సిద్దార్థ ...ప్రస్థానం --శర్వానంద్ ...

10. ఇలాంటి సినిమాలలో  పురాణ పత్రాల షేడ్ లు కనపడతాయి ...అవి వుంటే  సినిమా లో హీరో క్యారెక్టర్  పండుతుంది ...ఎందుకంటే  డ్రామా ఎక్కువగా పురాణాల్లోనే ఉంది కాబట్టి ...
Example :
దళపతి --మహా భారతాన్ని బేస్ చేసుకుని తీసారు ..
కర్ణుడు ,దుర్యోధనుడు ,అర్జునుడు ,కుంతీ ల మధ్య నడిచే కధ ..
బొమ్మరిల్లు ---ప్రహ్లాదుడు -హిరణ్యకశిపుడు మధ్య  జరిగే కధ లా వుంటుంది ...

11.డ్రామా లో ఒక పాయింట్ వుంటుంది ..అది ఎప్పుడు ఓపెన్ అవుతుందా ...అని ప్రేక్షకుడు తనకు తెలియకుండా  ఎదురు చూస్తాడు ..అది ఓపెన్ అవ్వగానే వాళ్ళ బాధని  ఫీల్ అవుతాడు ..అప్పుడు క్యారెక్టర్ లు బాగా నటించాలి ..
Example :
దళపతి --లో  రజని కాంత్  తన అమ్మను చూస్తాడు ..తర్వాత  "రజని మదర్ " అనే డ్రామా పాయింట్ మేల్ మెల్లగా ఒక్కోచోట ఓపెన్ అవుతూ వుంటుంది ...అప్పుడు డ్రామా బాగా పండుతుంది ...
నువ్వు నాకు నచ్చావ్ --వెంకటేష్ ప్రేమించిన విషయం  ప్రేక్షకుడి కి తెలుసు ..కానీ చెప్పడు...అదే డ్రామా పాయింట్ ...
దిల్ చాహతా హై --ప్రేమే లేదు అనే అమీర్ ఖాన్ ..ప్రేతిజింతా  ని ప్రేమించి ..చెప్పలేక పోవడం ...
Malamal weekly ,Rocket singh
Crucial point :
డ్రామా  ...వలన బాధ పుడుతుంది ...ఆ బాధ ప్రేక్షకుడ్ని మెప్పించాలి ...అప్పుడే  సినిమా లో హీరో క్యారెక్టర్ పండుతుంది ...హీరో క్యారెక్టర్ లో జీవిస్తే  ఇంకా బాగా పేరొస్తుంది ...


0 comments:

Post a Comment