Prema Kadhalu

ప్రేమ కధలు

ప్రేమ అనే పాయింట్ లేకుండా కధలు ... సినిమాలు రావడం లేదు .. వందలో 90 ప్రేమ కధలే వుంటాయి ...

ఇవి ముఖ్యం గా రెండు రకాలు ..

1.
ఫస్ట్ టైపు ప్రేమ కధలు

ప్రేమ అనే ప్రాబ్లం ఇంటర్వెల్ కల్లా ఎండ్ అవ్వడం ...
ఉదా: ఇడియట్, దిల్, ప్రేమికుడు, కొత్తబంగారులోకం, బొమ్మరిల్లు, నువ్వు - నేను, ప్రేమ, ఇష్క్, ప్రేమించుకుందాం రా ... ప్రేమంటే ఇదేరా ... జయం ... నువ్వొస్తానంటే నేనొద్దంటాన ....
2.
సెకండ్ టైపు ప్రేమ కధలు

ప్రేమ అనే ప్రాబ్లం క్లైమాక్స్ లో ఎండ్ అవ్వడం ......
ఉదా: తొలిప్రేమ, ఖుషి, ప్రేమదేశం, ఆర్య, ఆరాధన, గీతాంజలి, మనసంతా నువ్వే ..
ఎటో వెళ్ళిపోయింది మనసు ....


-------------------------------------------------- ----------------------------------------

ఫస్ట్ టైపు ప్రేమ కధలు

1.
హీరో, హీరోయిన్ లు ఎక్కడ? ఎలా? కలుస్తారు ... నేపథ్యంలో లో కలుస్తారు ...? అని బాగా ఆలోచించాలి ...

పెళ్లి లోనా ... కాలేజీ లోనా ... గుడి లోనా ... ట్రైన్ లోనా ... టూర్ లోనా ... ఎయిర్ పోర్ట్ లోనా ...
ఎక్కడయినా హీరోనే మొదట హీరోయిన్ ని చూసి ప్రేమలోకి దిగినట్టు చూపిస్తారు ... (థియేటర్ కి వచ్చేది ఎక్కువ అబ్బాయిలే కాబట్టి) ...

ఉదా: బొమ్మరిల్లు, ఇడియట్, ఇష్క్, నువ్వొస్తానంటే - నేనొద్దంటానా ..

2
హీరో -. హీరోయిన్ ని లవ్ లోదించడానికి రక రకాల ప్రయత్నాలు చేస్తాడు .. కొన్ని వెకిలిగా వుంటాయి .. కొన్ని ఆలోచించేలా వుంటాయి ... కొన్ని బాగుంటాయి ...

ప్రయత్నాల్లో మొదట హీరోయిన్ నుండి తిట్లు తిని .. చెంపదేబ్బో కొట్టించుకుని ... తర్వాత హీరోయిన్ లవ్ లోకి దిగడానికి ఒక మంచి సందర్భం చేస్తారు సృష్టించండి ... అప్పుడు హీరోయిన్ లవ్ లో దిగుతుంది ...

ఉదా:.. ఇడియట్, డి డి ఎల్ ..., ఇష్క్ ... బొమ్మరిల్లు ... జయం ... నువ్వు - నేను ...

3.
ఇక్కడ హీరోకి తన ప్రేమ ఇంటెన్సిటీ ఎంత వుందో ... ఒక డ్రీం సాంగ్ ద్వారా చూపిస్తారు ....

ఉదా: దిల్, జయం, బొమ్మరిల్లు, ప్రేమించుకుందాం రా ... ప్రేమికుడు ...

4
ప్రేమ హీరో -. హీరోయిన్ మధ్య ప్రేమ - తీవ్రం అయ్యిందని .. ఒక ప్రకీర్ణకం సాంగ్ ద్వారా చూపిస్తారు .. దానితో ఫస్ట్ హాఫ్ లో లవ్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ... నెక్స్ట్ ... వీళ్ళకి సెకండ్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ..

  a)
అది పెద్దల ద్వారా కావొచ్చు .....
  
బి) పరిస్థితులు కావొచ్చు ...
  
సి) అన్న / నాన్న ... విల్లన్స్ కావొచ్చు ....
 
డి) ఒక న్యూ క్యారెక్టర్ కావొచ్చు ...

5.
హీరో / హీరోయిన్ లు ఇద్దరూ వాళ్ళ ప్రేమ ను కాపాడుకోడానికి రక రకాల
పాట్లు పడాలి ... వీల్లిద్దరిని విడతీస్తే విరహం .. తెలివిగా కలుసుకోవడం ... జరుగుతుంది ..

ఉదా: ప్రేమికుడు, ఇడియట్, దిల్, డి.డి. ఎల్ .., జయం .., నువ్వు - నేను ... కొత్తబంగారులోకం ...

6.
ముఖ్యం గా హీరో తో లవ్ స్టార్ట్ చేస్తే ... హీరో నే ముందు ఉండి వచ్చే ప్రొబ్లెమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి ...

ఉదా: బొమ్మరిల్లు, డి.డి. ఎల్ .... ఇడియట్ ... నువ్వొస్తానంటే - నేనొద్దంటానా ...

7.
ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ఒక ట్రైల్ .. రెండు ట్రైల్స్ .. వేస్తూ వెళుతుంటే ఇంకా ప్రాబ్లం పెద్దది అవ్వాలి ... అలా వెళ్తూ వెళ్తూ ... క్లైమాక్స్ కి చేరుకొని హీరో నే సాల్వ్ చేయాలి ...

ఉదా: బొమ్మరిల్లు .. నువ్వొస్తానంటే - నేనొద్దంటానా ..

8.
చివరిగా ప్రేమకధకు మంచి ఎన్డింగ్ ఇవ్వాలి .. ఎన్డింగ్ మిగిలిన క్యారెక్టర్ మీద ఆధారపడి వుంటుంది ...

ఉదా: బొమ్మరిల్లు ... --- ప్రకాష్ రాజ్ మారిపోతాడు కాబట్టి .. ఒక లాంటి ఎన్డింగ్ ..

ఇడియట్ ... --- ప్రకాష్ రాజ్ మారడు ... కాబట్టి రవితేజ dgp దగ్గరకు వెళ్తాడు ..

డి.డి. ఎల్ .., జయం .., నువ్వు - నేను ... కొత్తబంగారులోకం ... అన్నింటి లో ఒక డిఫరెంట్ ఎండింగ్స్ వుంటాయి ... ఏది ఏమయినా హీరో హీరోయిన్ లు కలవడమే ...

9.
సినిమా కధలో మారిపోయే క్యారెక్టర్ లను మార్చాలి ... మారవు అనుకున్న క్యారెక్టర్ లను వదిలేయాలి ... దీనివలన క్లైమాక్స్ బాగుంటుంది ...

ఉదా: బొమ్మరిల్లు --- ప్రకాష్ రాజ్

నువ్వొస్తానంటే - నేనొద్దంటానా - గీత, శ్రీహరి

ప్రేమంటే ఇదేరా --- శ్రీహరి

డి.డి. ఎల్ .. ---- అమ్రిష్ పురీ

10.
ముఖ్యమయిన పాయింట్ ఏమిటంటే ....

హీరో హీరోయిన్ లు నిజం గా ప్రేమించుకున్నారని ప్రేక్షకులు నమ్మాలి .. అలా వుండాలి ... అప్పుడే ప్రేమ కధ పండుతుంది ..

అందం "అనే మాట వాడొచ్చు కానీ .. ప్రియురాలి శరీరాన్నే చూసి ప్రేమించాడు అని చూపించకూడదు ... భౌతికమైన ఆకర్షణ కి వేల్యూ ఇవ్వకూడదు .. క్యారెక్టర్ లకు వ్యక్తిత్వం ఉంచాలి ... అప్పుడే కధలు బాగుంటాయి ...

 
ఉదా: బొమ్మరిల్లు --- జనీలియా

0 comments:

Post a Comment