Script rule-13




 Script rule-13

Any character may be small or big, it must have importance in the cinema..
సినిమా లో వచ్చేది చిన్న పాత్ర (క్యారెక్టర్) లేదా పెద్ద పాత్ర (క్యారెక్టర్) అయినా సరే ..
దానికి ప్రాధాన్యం వుండాలి ......

Example :

గోదావరి:
ఇందులో బుడగలు అమ్మే పిల్ల వాడి క్యారెక్టర్ వుంది .... చివరకు కుక్క క్యారెక్టర్ వుంది .. అన్నీ కధ లో బాగంగా వుంటూ ... కధను నడిపిస్తూ హీరో, హీరోయిన్ లకు హెల్ప్ చేస్తూ సాగుతుంటాయి .. హీరో క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ లు పిల్ల వాడి మీద జాలి చూపించడం కుడా బాగుంటుంది ...

అతడు:
 సునీల్ క్యారెక్టర్ కామెడీ కోసం పెట్టారని అనుకుంటాము ... కానీ సునీల్ పాత్రే మహేష్ బాబు చేసిన మంచి పనులన్నీ చెబుతుంది ... హీరో క్యారెక్టర్ elivation కి ఉపయోగ పడుతుంది ...

శత్రువు:
జేబులు కొట్టేసే చిన్న పిల్ల వాడి క్యారెక్టర్ ఒకటి వుంది ... అది సినిమా లో అసలయిన విల్లన్ ని బయట పెట్టడానికి ఉపయోగ పడుతుంది .. అలాగే నగేష్, బ్రహ్మానందం క్యారెక్టర్ లు కూడా కధ కు ఉపయోగ పడతాయి ....

మన్మధుడు:
 ఆఫీసు లో ఒక ప్రేమ జంట ని చూపిస్తాడు ... వాడికి నాగార్జున "ప్రేమ" వద్దు అని .. అమ్మాయిలు వాడుకుని వదిలేస్తారని - క్లాసు పీకుతాడు ..
అదే నాగార్జున .. సెకండ్ హాఫ్ లో వాళ్ళిద్దరి పెళ్లి దగ్గరుండి చేస్తాడు ... నాగార్జున లో మార్పు వచ్చిందనడానికి రెండు క్యారెక్టర్ లు ఉపయోగపడతాయి ..

నలుగురు:
 సినిమా వెళ్తున్న కొద్దీ వచ్చిన పాత్రలన్నీ రాజేంద్రప్రసాద్ ని హైలైట్ చేయడానికే ఉపయోగపడతాయి .. ఇంట్లో క్యారెక్టర్ లు అన్నీ కాస్త నెగటివ్ సహదే లో వుంటాయి ... కానీ అన్నీ అవసరమే కదా ...

నువ్వు నాకు నచ్చావ్:
బ్రహ్మానందం ... కామెడీ కోసం పెట్టారని అనుకుంటాము ... క్యారెక్టర్ తీసిన ఫోటో వలనే సినిమా కధ లో కీలక మలుపు వస్తుంది ..

final  point line :

క్యారెక్టర్ సృష్టించినా .. అది హీరో కి మంచి చేయడానికో .. చెడు చేయడానికో .. ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికో ... ఆలోచన రావడానికో .. స్పందించ డానికో ... హీరో క్యారెక్టర్ elivate చేయడానికో ఉపయోగ పడాలి ... లేకపోతే సృష్టించడం వేస్ట్ ...

0 comments:

Post a Comment