Artical 7




డైరెక్టర్ కావాలంటే .... (పది మంచి సినిమాలు తీయాలంటే)

Step 1: తెలుగు రావాలి
తెలుగు బాగా వచ్చి వుండాలి .. ఎందుకంటే తీసేది తెలుగు సినిమా కాబట్టి ..
తెలుగు రాయడం .. బాగా రావాలి .. కనీసం రాయడం వస్తే మీ స్టొరీ మీరే రాసుకుంటారు .. లేకపోతే వేరే వాళ్ళ మీద ఆధార పడాల్సి వస్తుంది ...

Step 2 :  సాహిత్యం చదవండి
తెలుగు లో గొప్ప సాహిత్యం వుంది .. ఎందఱో గొప్ప రచయితలు -. వాళ్ళ ఆలోచనలను, అనుభవాలను కలిపి సమాజానికి ఉపయోగపడేలా రచనలు చేసారు ... వాళ్ళు అందించిన పుస్తకాలే మీకు Creative Source గా ఉపయోగపడతాయి ... గోపీచంద్, శరత్, చలం, శ్రీ శ్రీ .. కారా .. కోకు .. శారద , యండమూరి, యద్దనపూడి, నవీన్ .... ఇలా ఎందఱో మహాను భావులు వున్నారు ... వాళ్ళ రక్తాన్ని అక్షరాల్లో కి మార్చి ఇచ్చారు ... అవి చదవండి ... మళ్ళీ మళ్ళీ చదవండి ... దీనివలన కొత్త ఆలోచనలు ... కొత్త పాయింట్ అఫ్ వ్యూస్ .. కొత్త గా ఆలోచించడం తెలుస్తుంది .... ఇలాగె ఇంగ్లీష్, బెంగాలీ, తమిళ్ .. సాహిత్యాన్ని వదలొద్దు ... నమిలేయండి ... ఎందుకంటే కాస్తో కూస్తో బుక్స్ చదివిన వారె ఇండస్ట్రీ లో నిలబడ్డారు ....

Example : త్రివిక్రమ్ శ్రీనివాస్, క్రిష్, పరుచూరి బ్రదర్స్, కృష్ణ వంశీ, పూరి జగన్నాథ్ ....
 ఇలా 2 ఇయర్స్ చేయండి ..  Creativity అదే వస్తుంది ...

Step 3 : సినిమాలను ఎనాలిసిస్ చేయండి :

స్టెప్ 1 లో తెలుగు వచ్చింది ..
స్టెప్ 2 క్రియేటివిటీ వచ్చింది ..
ఇప్పుడు సినిమాలను ఔపోసనం పట్టండి ...
నచ్చిన / నచ్చని సినిమాను ఎనాలిసిస్ చేయండి ...
ఆడియన్స్ పల్స్ పట్టుకోండి ...
కధ ఎలావుండాలి? ఎలా వుంటే చూస్తున్నారు? సీన్ లు ఎలా రాస్తున్నారు?
తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ ... కొరియన్ .. జర్మన్ ... ఇరాన్ .. బాషలో అయినా సినిమా చూడండి ... చూస్తూ వుండండి .. (కాపీ కొట్టడానికి కాదు ....)
ఆలోచనలు విస్తృతం కావడానికి .... గొప్పగా ఆలోచించడానికి .....

Step 4 : స్క్రీన్ ప్లే బుక్స్ చదవండి

ఇప్పుడు స్క్రీన్ ప్లే బుక్స్ దొరికినవన్నీ చదవండి .. సిడ్ ఫీల్డ్ బుక్స్, సేవ్ ది కాట్, మెక్ గ్రఫ్ఫిత్ ... మైకేల్ హాగ్ బుక్స్ చదవండి ... స్క్రిప్ట్ ఎలా ఉండాలో అవగాహనకు రండి ... (స్క్రీన్ ప్లే అనేది మీకు మీరుగా చేసుకోవాల్సిందే). బుక్స్ ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటాము ...

Step 5 : స్క్రీన్ ప్లే బుక్స్ + సినిమా ఎనాలిసిస్

ఇప్పుడు స్టెప్ 3, 4 స్టెప్ ని కలిపి ఎనాలిసిస్ చేయండి .... అంటే సినిమా ని .. మీరు చదవిన స్క్రీన్ ప్లే బుక్స్ తో పాటుగా అర్ధం చేసుకోవడం ... స్ట్రక్చర్, క్యారెక్టర్, స్టొరీ, ప్లాట్ పాయింట్స్ ... టర్నింగ్ లు .. ఇలా అన్నమాట .. . దీని వలన పూర్తిగా సినిమాల గురించి అవగాహన పూర్తిగా వస్తుంది .. దీని వలన మీరు ఫాస్ట్ గా కధ అల్లగలుగుతారు ...

Step 6 : స్క్రిప్ట్ రాయడం
 
ఇప్పుడు మీబుర్రలోకి వచ్చిన సినిమా లైన్స్ తీయండి .. వాటిని Develop చేయండి ...
1.
కధ పూర్తిగా మీరే రాయడం .. ఒక పద్ధతి ..
2.
కధ మీ ఫ్రెండ్స్ తో కలసి రాయడం రెండవ పద్ధతి ...
3.
కధ లైన్ మీదే .. వేరే రైటర్ తో కలసి రాయడం ... మూడవ పద్ధతి ...
ఎలాగయినా చివరిగా మీరు రాయాల్సింది మంచి సినిమా కధ ...
ఇక్కడ కధ లో కొత్తదనం వుండాలి .. క్రియేటివిటీ వుండాలి .. ఎంటర్టైన్మెంట్ వుండాలి .. ముఖ్యం గా స్ట్రక్చర్ వుండాలి ...ఇవన్నీ వున్న స్క్రిప్ట్ వుంటే చాలు ... సగం మీరు హిట్ అవుతారు ...
కధ బాగుందో లేదో .. .. ముందే ఆత్మ విమర్శ చేసుకోండి .. ఒకటికి పది సార్లు ఆలోచించండి .. (ఫ్లాప్ అయితే ఎవరూ దగ్గరకి రారు కదా ... అందుకు ...)

Step 7 : బ్రాండ్ సృష్టించడానికి చేసుకోండి
 
ఎటువంటి స్క్రిప్ట్ అయినా మీ స్టైల్, మే పాయింట్ అఫ్ వ్యూ ఒకటి ఉండేలా చూసుకోండి ... అలా స్టైల్ వున్నా వారే ఇండస్ట్రీ లో వున్నారు .. కొన సాగుతున్నారు .. మిగిలిన వాళ్ళను ఎవరూ పట్టించుకోరు .. Example : శేఖర్ కమ్ముల, దేవా కట్ట ..., క్రిష్ ... వర్మ. . పూరి .. త్రివిక్రమ్ ...

Step 8 : Cinema Making

ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చదివి వచ్చిన వారికి చెప్పాల్సిందేమీ లేదు .. అంతా తెలుసుకునే వస్తారు ... అసిస్టెంట్ డైరెక్టర్ గా 2,3 సినిమాలు చేసిన వారికి సినిమా మేకింగ్ మీద పట్టు వస్తుంది ... చిన్న చిన్న విషయాలు కుడా తెలుస్తాయి ... మెకానికల్ గా కాకుండా క్రియేటివ్ గా ఆలోచిస్తే బాగుంటుంది ...మేకింగ్ గురించి కుడా అవగాహన వచ్చింది ...
దీనికి 2,3 ఇయర్స్ పడుతుంది ...

Step 9 : Final hurdle

కొత్తగా వుండే 5,6 స్క్రిప్ట్స్ తో ప్రొడ్యూసర్ ని కలసి వోప్పించుకోవాలి .. ఇదే అన్నింటికన్నా కష్ట మైనది ... సర్కిల్ వున్నా ... పేరు వున్నా .. విషయం వున్నా మీకు ఇండస్ట్రీ ఛాన్స్ ఇస్తుంది ... దాన్ని నిలబెట్టుకోండి ... మంచి టీం తో ప్లాన్ గా దిగండి. .. విజయం మీదే ....
ఇండస్ట్రీ లో ప్రతీ ఇయర్ 20 నుండి 30 మంది డైరెక్టర్ లకు ఛాన్స్ వస్తుంది ... ఎంత మంది ఇండస్ట్రీ లో వుంటున్నారు .. ఎంత మంది కి 2 సినిమా ఛాన్స్ వచ్చింది? ఒక్కస్సారి ఆలోచించండి ...
(ఫస్ట్ హిట్ అయితే ఇండస్ట్రీ లో రెండవ సినిమా వుంటుంది ..
మంచి సినిమా తీసి - అది ఫ్లాప్ అయినా సినిమా వుంటుంది ..
కానీ ఫ్లాప్ సినిమా తీస్తే .. 2 ఇయర్స్ వరకు సినిమా వుండదు ....)

Step 10 : ఇండస్ట్రీ లో కొనసాగటం
 
మీకంటూ బ్రాండ్ ఇమేజ్ వుండాలి .. మీ సినిమా పక్కాగా కొత్తగా వుండాలి .. ప్రతీ సినిమా లో మీ మార్క్ గలిగిన స్క్రిప్ట్ ఎంచుకోవాలి ... లేదా జానర్ స్క్రిప్ట్ అయినా డీల్ చేయగలగాలి ... అప్పుడు మీరు కొనసాగగలరు .. మారుతున్న యువత ని .. వాళ్ళ ఆశల్ని .. ఆలోచనల్ని ప్రతిభింబించే స్క్రిప్ట్ లు ఎంచుకుంటే చాలు విజయం మీదే ....

final Suggestion :

ఇండస్ట్రీ లో త్వరగా డైరెక్టర్ అవ్వాలంటే చాలా శ్రమ పడాలి .. దానికి మన దగ్గర అర్హత ఉందా? లేదా? తెలుసుకోవాలి ... అంతే కాని ఏదో ఛాన్స్ వచ్చిందని .. డబ్బు కోసమని .. ప్రొడ్యూసర్ వున్నాడని ... చెత్త ఐడియా వున్నా .. చెత్త స్క్రిప్ట్ తో సినిమా తీయకండి ... దీనివలన ప్రొడ్యూసర్ డబ్బు వేస్ట్ అవ్వడమే కాదు ... మీ టైం వేస్ట్ అవుతుంది ... పేరు పోయి .. ముఖం చూపలేక మీరు బాధ పడి depression లోకి వెళ్తారు ... ముందు అర్హత సంపాదించి దిగండి .. విజయం మీదే ....All the best for future Directors ...I want see the Telugu film industry with more hits and National awards  with audience Claps ..........


0 comments:

Post a Comment