The Dirty Picture





The dirty picture = silk life + love +sex
సినిమా ప్రపంచం లో సెల్లింగ్ పాయింట్స్
సెక్స్ ...( మర్డర్ ,రాజ్ )...
క్రైమ్ (సత్య ,కంపెనీ )...
లవ్ ( డి.డి.ఎల్ ..తాల్ ... జబ్  వి మెట్ )
కామెడీ (హేరా ఫెరి , వెల్కమ్ ..మాలామాల్ వీక్లీ , గోల్ మాల్ )
మనీ (జానీ గద్దర్, విక్టోరియా 203, స్లం డాగ్ మిలియనీర్ ...)
ఎమోషన్స్ (రంగ్ దే బసంతి , లగాన్ ...చక్దే ఇండియా )
ఫ్రెండ్షిప్ ( షోలే , దిల్ చాహ్త హాయ్ ..3 ఇడియట్స్ )
రిలేషన్స్ ( కభి కుషి కభి ఘం ....మదర్ ఇండియా ...హమ్ ఆప్ కె హైన్ కౌన్ )
రివెంజ్ ( ఘజిని ,వేడ్నాస్ డే ..,జంజీర్ )...ఇలా చాలా వున్నాయి ...
----------------------------------------------------------------------------------------------------
ప్రేక్షకుడి కి కావాల్సింది ఎంటర్టైన్మెంట్ ...తనకి కావాల్సింది ..తనకు దొరికిందా చాలు సినిమా ని ఆకాశానికి ఎత్తేస్తాడు ...దొరకలేదా పాతాళానికి తోసేస్తాడు ...
సినిమా లో ఫోటోగ్రఫీ బాగుందా ? లైటింగ్ బాగుందా ? షాట్స్ బాగున్నాయా..? అంటూ లెక్కలు వేసుకోడు ...అంత ఇంటిల్లిజేంట్ ప్రేక్షకులు 10-20 % మాత్రమే వుంటారు ...మిగిలిన 80-90 % సాధారణ ప్రేక్షకులే ....
సిల్క్ స్మిత జీవిత గాధని అర్ధవంతం గా సినిమా తీసి ..సినిమా లో సిల్క్ ఆత్మ ప్రవేశ పెట్టి ..సులువుగా 100 కోట్లు నొక్కేసారు ...అదే "ది డర్టీ పిక్చర్ ".
Script points:
1    లైఫ్ బయోగ్రఫీ తీస్తున్నప్పుడు ముఖ్యమైన వ్యక్తులు (క్యారెక్టర్ లు ) గుర్తిస్తే ...వాటిని మెయిన్ క్యారెక్టర్ (హీరోయిన్ ) జీవితం లోకి ఎలా వచ్చారు ? ఎలా క్లోజ్ అవుతారు ?...ఎలా దూరం అవుతారు ..అనేది పద్దతిగా రాసుకోవాలి ...ఒక వ్యక్తి వెళ్ళిపోయాక ..ఇంకొక వ్యక్తి ఎలా జీవతం లోకి వచ్చి ఎలా దగ్గరయి ..ఎలా దూరం అవుతాడు ...అప్పుడు మెయిన్ క్యారెక్టర్ ఆ యా వ్యక్తుల పనుల వలన ఎలా రియాక్ట్ అవుతుంది ...ఎలా ఎత్తులకు ఫై ఎత్తులు వేసి ..మగవాడి అహంకారాన్ని ఎలా దెబ్బతీస్తుంది ....ఎలా ఎదుగుతుంది ..ఎలా పతన మవు తుంది ...అని క్లియర్ గా రాసుకున్నారు ....నస లేకుండా ..సూటిగా వెళ్లారు ...

Starting: సిల్క్ బాల్యం ..ఆశలు ...
Plot point 1: సిల్క్ గా మారడం ..నిర్మాత సెల్వ పెడతాడు ..
Turning point 1: సూర్యకాంత్ (నశీరుద్దిన్ షా )సిల్క్ లైఫ్ లోకి రావడం

Turning point 2: రమాకాంత్ (తుషార్ కపూర్ ) సిల్క్ లైఫ్ లోకి రావడం 

Mid point: సిల్క్ అందనత ఎత్తుకి ఎదగడం

Plot point 2: సిల్క్ పత్రికలో పుకార్లకు స్పందించడం

Turning point 3: సిల్క్ షూటింగ్ లో concentrate చేయలేక పోవడం

Turning point 4: సిల్క్ ప్రొడ్యూసర్ గా మారడం

Turning point 5: సిల్క్ జీవితం లోకి డైరెక్టర్ అబ్రహం (ఇమ్రాన్ హస్మి ) రావడం

Pre climax: సిల్క్ ని ఇబ్బంది పెట్టి బాడ్ ఫిల్మ్స్ తీయడం 

Climax: సిల్క్ మరణం

2. Characterizations :
    

Suryakanth : సూర్యకాంత్ (నశీరుద్దిన్ షా ) :

ఒక పెద్ద హీరో ఎలా బిహావ్ సెట్ లో చేస్తాడు ? భార్యకి తెలియకుండా ఎలా హీరోయిన్ తో గడుపుతాడు ?హీరోయిన్ ని కావాలనుకుంటే ఛాన్స్ లు కల్పిస్తూ
పాత పడ్డాక అమ్మ క్యారెక్టర్ లోకి మార్చేస్తాడు ...ఆడ వాళ్ళని వస్తువులు గా చూసే ..అహం వున్న మగ వాడు ...

ఈ క్యారెక్టర్ వలన సిల్క్ సినీ ప్రయాణం పుంజుకుంటుంది ...ఎదుగుదల వుండి..అమాయకం గా ప్రేమిస్తుంది ....ఆ తర్వాత ఆ ప్రేమ బాగ్నం అవుతుంది ..

Ramakanth రమాకాంత్ (తుషార్ కపూర్ ) :
నార్మల్ గా ,స్మూత్ గా వుండే సాధారణ మగవాడు ...
సూర్యకాంత్ తమ్ముడు ...సిల్క్ తన జీవితం లోకి రాగానే అనుభవించి ..
కాస్త ప్రేమించి ..  అవకాశాలు రాగానే సిల్క్ ని కావాలనే దూరం చేస్తాడు ....
ఈ క్యారెక్టర్ వలన సిల్క్ సూర్యకాంత్ దగ్గర బ్రగ్న ప్రేమను ..
రమాకాంత్ మీదకు   మళ్ళిస్తుంది ...ప్రేమిస్తుంది ..తనని అర్పించుకుంటుంది ....
కానీ మళ్ళీ దెబ్బ తింటుంది ......

Abraham  డైరెక్టర్ అబ్రహం (ఇమ్రాన్ హస్మి ) :
ఒక మంచి సినిమా తీసే ఫిలిం డైరెక్టర్ ..సెక్స్ ని సినిమాల్లో పెట్టకుండా
సినిమా హిట్  అవ్వాలని చూసే డైరెక్టర్ ..చివరకి మసాలా ఫిలిం తీసి
మనుగడ   సంపాదించిన డైరెక్టర్ ....ఈ క్యారెక్టర్ తో సిల్క్ ప్రతీ సరి గొడవ పడి..
చివరిగా సిల్క్ ని అర్ధం చేసుకున్న అసలయిన మగ వాడు .
 ...ద్వేశిస్తూనే ...ప్రేమిస్తాడు ...     సిల్క్ ని పెళ్లి చేసుకుందాం –
అని అనుకుంటాడు ..కాని సిల్క్ మరణిస్తుంది ..సిల్క్ జీవితం లో చివరి వ్యక్తి ...
అతనితో   వాయిస్ ఓవర్ ఇవ్వడమే బెటర్ ...దానివలన ఒక జీవిత కాలాన్ని
చెబుతూ    వెళ్తాడు ....

 Producer –selva :
సిల్క్ ని గుర్తించింది ..పేరు పెట్టింది ..సిల్క్ ని అడ్డం పెట్టుకుని సంపాదించింది ....
సిల్క్ అహాన్ని సూర్యకాంత్ దగ్గర చెప్పేది ..
డైరెక్టర్ పక్కనే వుంటూ మసాలా షాట్స్ ని ప్రోత్సహించేది ...
అన్నీ .ప్రొడ్యూసర్ సేల్వనే ...   .  సినిమా కి catalyst ..
ఈ క్యారెక్టర్ వలన సిల్క్ పేరు మారింది ...సినిమా ప్రయాణం మొదలు అయ్యింది ..
చివరిగా   ప్రొడ్యూసర్ అయ్యి నాశనం అయ్యింది ...

ఒక జీవిత కాలాన్ని లేదా 5 10 ఇయర్స్ టైం ని కదా గా చెప్పాలంటే ముఖ్య సంఘటనలు   ..   క్యారెక్టర్ లు ...మలుపులు ..బావోద్వేగాల ద్వారానే చెప్పాలి ...దానికి వాయిస్ ఓవర్ బెటర్ ...
Ex : 3 ఇడియట్స్ ...హ్యాపీ డేస్ ..ఆ నలుగురు ....

Nyla  నైలా (విమర్శకుడు రచయిత)
 
అన్ని క్యారెక్టర్ లు మగవాళ్ళవి అయ్యాయి ...ఇదొక్కటే లేడీ క్యారెక్టర్ ...ఒక ఆడది ఇంకొక   ఆడదాన్ని అర్ధం చేసుకోగలదు ...శత్రువుగా ఉండగలదు ...ఏడిపించ గలదు ...ప్రోత్సహించగలదు....
ఈ క్యారెక్టర్ లు పత్రికల్లో రాసే రాతల వల్ల సిల్క్ తీవ్రం గా బాధపడుతుంది ..లైఫ్ ని మొత్తం నాశనం చేసుకుంటుంది ..మెంటల్ గా డిస్టర్బ్ అవుతుంది ...

3.Scenes:
1. What is the purpose of each scene? How does it advance the story? Does it reveal something important about the character?
2. Whose scene is it? What does he/she want? What are his/her obstacles to getting it? What is the conflict in the scene?
ప్రతి సీన్ సిల్క్ క్యారెక్టర్ ని చూపించడానికి ..అమాయకత్వానికి ..తెగువకి ...తెలివితేటలకు ....ఊహించని ఆలోచనలకూ తగినట్టుగా ..మగవాడిని ఎంతో లోతుగా అర్ధం చేసుకున్న దానిలా మాటలు పెట్టి అద్భతం గా రాసారు ...తీసారు ..ఏసీన్ చూసినా కధ పద్దతిగా ముందు కెల్ల డానికి పనికి వస్తుంది ...మిగిలిన క్యారెక్టర్ ల అసలు రంగు బయటపడటానికి ..తద్వారా సిల్క్ reaction బయటపడటానికి ఉపయోగ పడుతుంది ...
మనసులో చెప్పలేనివి ..చూపలేనివి ...వాయిస్ ఓవర్ ద్వారా చెప్పించారు ...


హీరోయిన్ కి ప్రతీ సీన్ లో ఇబ్బంది పడుతుంది ... దాన్ని ఎలా దాటుకుని .. ఆ ఇబ్బంది ని ఎలా రఎచ్త్ అయ్యి సిల్క్ గా ఎదిగింది ... ఎలా బ్రతికింది ... ఎలా దీటుగా మాట్లాడింది .. అన్నదే సిల్క్ క్యారెక్టర్ ... ఇదే ఆక్టివ్ క్యారెక్టర్ ...

1. సినిమా హాల్ లో చెయ్యి వేసి, 20 రూపాయలు ఇచ్చి, వస్తావా అంటే ఎలా రియాక్ట్ అయ్యింది?

2. రోడ్ మీద ఒకడు కన్ను కొట్టి పిల్చినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యింది?

3) షూటింగ్ స్పాట్ లోకి వచ్చి డబ్బులు వాపస్ ఇచ్చి, కొరడా లాక్కొని మరీ డాన్సు వేయడం.

4) హీరోయిన్ అయినప్పుడు .. డాన్సు చేస్తూ ... సూర్యకాంత్ చేత తిట్లు తిని .. మాటల్లో ఎదురించి .. తర్వాత ట్యూనింగ్ చేయడం.

5) ఇంటర్వ్యూ కి వస్తున్నారని తెలిసి ... .. బాత్ టబ్ లో వుండి .. ఫోటో లు తీసుకోమనడం ... ఇవన్నీ సిల్క్ క్యారెక్టర్ ని Elevate  చేసేయే ....

మిగిలన సీన్ లు కూడా కధ కు తగిన విధం గా వుంటాయి ....

Symbolism :

1.     సిల్క్ తన బాల్యం లో నిచ్చెన ఎక్కి కింద పడటం ..తన సినీ జీవితానికి నిదర్శనం ....సినీ ప్రయాణం ఎలా ఉండబోతుందో ..అన్న దానికి సింబల్...

2.     సిల్క్ లైఫ్ టర్న్ అయ్యేముందు ..ప్రతీసారి ఒక యంగ్ బాయ్ ని సిల్క్ దగ్గరకు రాపించాడు డైరెక్టర్ ....సిల్క్ జీవిత మలుపు తిరుగుతుంది అని చెప్పడానికి వాడాడు ....3,4 సార్లు వస్తాడు ఆ అబ్బాయి ...

ఇటువంటి సంకేతాలను ఇదే డైరెక్టర్ తీసిన once upon  a time in Mumbai లో కూడా వుంది (వెతకండి)

Plantings and payoffs :

ఒక్క dialogue ని మాత్రమే వాడారు

Film needs three things to sell …Entertainment..Entertainment..Entertainment ….

ఇది ఫస్ట్ హాఫ్ లో సిల్క్ - డైరెక్టర్ కి చెబుతుంది ..
సెకండ్ హాఫ్ లో డైరెక్టర్ - నైల కి చెబుతాడు ...

Dialogues:

Great dialogue is a window into the soul of your character. It sounds real... It's conversational. The audience feels like a fly on the wall, hearing natural interplay between characters.

ప్రతి సీన్ లో వున్నా dialogues .. అందులో వున్నా ఫీల్, డెప్త్, సెక్స్, లవ్ .. ఎమోషన్స్ ని రకరకాల వస్తువులతో .. పకృతి తో పోల్చి చెప్పడం బాగుంది ..

క్యారెక్టర్ కి తగిన dialogues రాసారు .... కొన్ని ఆలోచింప చేస్తాయి .. కొన్ని గుర్తుపెట్టుకోనేల చేస్తాయి .. కొన్ని నవ్వి స్తాయి .. కొన్ని కవ్విస్తాయి ...

Final point :

సౌత్ స్టార్ అయిన సిల్క్ కధ ని .. జీవిత వ్యధని ... నార్త్ వాళ్ళు అధ్యయనం చేసి సిల్క్ ని ఒక మనసున్న అమ్మాయిగా ... అమాయకురాలిగా ... అసామాన్య రాలిగా ... మగవారిని ఎదురించి ఫిలిం ఇండస్ట్రీ లో బ్రతికి, ఎదిగి, చితికిపోయిన తారగా తెరకెక్కించారు ...


The dirty picture = silk life + love +sex

సెక్స్, లవ్ - అనే రెండు సెల్లింగ్ పాయింట్స్ వున్నాయి ..

ఒకటి (సెక్స్) బాగా కనిపిస్తుంది ..

రెండవది (లవ్) సరిగ్గా చుస్తే కనిపిస్తుంది ..

0 comments:

Post a Comment