Vicky Donor






The future generation movie linked with Indian cultures, sentiments and emotions ..especially love …
హిందీ సినిమాలు సృజనాత్మకత తో ఒక్కోసారి కొత్త పుంతలు తోక్కుతుంటాయి ..
"విక్కీ డోనార్" కధ లో కుడా ఫార్ములా వుంచి .. భావోద్వేగాలను పెంచి .. హిట్ కొట్టారు ...
 
                                             --------Coming to the point -------------

Main plot: డాక్టర్ చడ్డా .. విక్కీ మధ్య జరిగే స్పెర్మ్ డోనార్ విధానం...
Sub plot:  విక్కీ - అషిమా మధ్య జరిగే ప్రేమ - పెళ్లి కధ..
.
Formula points :

1. there must be problem rise in “sub plot”  because of  “main plot “ or  vice versa ….And ultimately problem faced by the main hero …that is main script point …
హీరో చేసే పనుల వలన .. తన ప్రేమ కధ లో ఇబ్బంది వస్తుంది .. అదే మెయిన్ స్క్రిప్ట్ పాయింట్ ... స్పెర్మ్ డోనార్ గా ఉన్న విక్కీ ... విషయం అషిమా కి తెలియగానే ప్రాబ్లం వస్తుంది ...
అదే కాన్ఫ్లిక్ట్ కు లీడ్ ...
ఇందులో రెండు కాన్ఫ్లిక్ట్ లున్నాయి ...
1.
పంజాబ్ కల్చర్ గల విక్కీ ... బెంగాల్ కల్చర్ గల అషిమా ... మధ్య పెళ్లి .. ఒకటి

2.
మెయిన్ కాన్ఫ్లిక్ట్ ... విక్కీ స్పెర్మ్ డోనార్ అని అషిమా కి తెలియడం ... రెండవది ...
ఇవే సెకండ్ హాఫ్ ని కాపాడాయి ...


2.”main plot “ must  run along with the  “subplot”…otherwise audience feel bore…
ఫస్ట్ హాఫ్ లో డాక్టర్ చడ్డా విక్కీ ని స్పెర్మ్ డోనార్ గా మార్చే ప్రాసెస్ ఒక మెయిన్ ట్రాక్ నడిస్తే .... అషిమా తో విక్కీ ప్రేమ కధ సెకండ్ ట్రాక్ నడుస్తూ వుంటుంది ... దీని వలన ప్రేక్షకుడు బోర్ ఫీల్ కాకుండా ... నవ్వుతూ హీరో తో ట్రావెల్ చేస్తాడు ...


3.Interval block : the midpoint of the movie
డాక్టర్ చడ్డా .. విక్కీ ని వెతికి ... నచ్చ చెప్పి .. ఒప్పించుకొని స్పెర్మ్ డోనార్ గా తీసుకున్నాడు ... డాక్టర్ చడ్డా వ్యాపారం బాగా పుంజు కుంది .... అప్పుడు విక్కీ వచ్చి - "నేను ఇంక స్పెర్మ్ డోనార్ గా ఉండను" అనడం , లవ్ కి వేల్యూ ఇవ్వడం .... తో కధ కి తగినమిడ్ పాయింట్ఇవ్వడం బాగుంది .. ఫీల్ గుడ్ మూవీ కి ఇది చాలు ....

4. closed drama point  is main thread …..That should open at some point ……
విక్కీ స్పెర్మ్ డోనార్ అని ప్రేక్షకుడి కి, డాక్టర్ చడ్డా కి మాత్రమే తెలుసు .. క్లోస్డ్ డ్రామా పాయింట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా? అనే ది మనకు తెలియకుండా మైండ్ లో రన్ అవుతుంది ... డ్రామా పాయింట్ హీరోయిన్ అషిమా కె ముందు తెలియడం బాగుంది .. తర్వాత అందరికీ తెలుస్తుంది ... ( సినిమా లో అయినా హీరోయిన్ కే ముందు తెలుస్తుంది .. ఉదా: రంగం, టాగోర్, జెంటిల్ మాన్) .. ..

5.preclimax : hero must fall down ..he becomes zero ..
హీరో ఏమి చేయలేని .. చేతకాని పరిస్థికి వస్తాడు ... హీరో ప్రీ క్లైమాక్స్ పోజిసన్ లో జీరో అవుతాడు ... విక్కీ ని అందరూ అసహ్యించు కుంటారు .... జైలు కి వెళ్తాడు .. ఇది ప్రీ క్లైమాక్స్ పోజిసన్ ...

6. casuality: there must be a clear casual relationship between the inciting incident  and the climax .This is done through unity of theme  and scenes…
కధ లో క్యారెక్టర్ ద్వారా ప్లే మొదలయిందో అదే క్యారెక్టర్ వలన హీరో లైఫ్ లో మార్పు జరిగిందో .. బాధ జరిగిందో ... క్యారెక్టర్ మాత్రమే ఎండింగ్ ఇవ్వడం బాగుంది ...
డాక్టర్ చడ్డా వలెనే విక్కీ స్పెర్మ్ డోనార్ అయ్యాడు ... అషిమా కి దూరం అయ్యాడు ... చివరకు చడ్డా చేసిన క్లైమాక్స్ (వార్షికోత్సవం ఫంక్షన్) ద్వారా నే హీరోయిన్. అషిమా తెలుసుకుంటారు అవ్వడం .... చివరిగా మిగిలిన అమ్మాయిని పెంచుకోవడం ... చేసి స్క్రిప్ట్ ని పరిపూర్ణం చేసాడు .. .
భారత దేశ  విలువలు లో పిల్లలకు ఎంత ప్రాముఖ్యతను ఇస్తారో ... ఎన్ని ఆనందాలు వున్నాయో చూపాడు ...
కధలో మొదటి సగం లో ఉన్న పనులు, వదిలేసినా క్యారెక్టర్ ద్వారానే రెండవ సగం లో క్లైమాక్స్ ఇవ్వడం చాల గొప్ప విషయం ... అప్పుడు ఆవరణలో మారదు .. కధ ఒక పద్దతిగా వుంటుంది ... ఒక దశ - దిశా వుంటుంది ...

7. setup:
పంజాబ్ కల్చర్ - విక్కీ ఫ్యామిలీ ది .. ఫ్యామిలీ వాల్యూస్ కి వేల్యూ ఇస్తారో చూపారు ...
బెంగాల్ కల్చర్ - అషిమా ఫ్యామిలీ ది ... ఎంత బ్రాడ్ గా ఆలోచిస్తారో చూపారు ..
విక్కీ అషిమా ప్రేమ విషయం వాళ్ళ ఇళ్ళలో తెలియగానే వాళ్ళు స్పందించే విధానం లో అషిమా ఫాదర్ "సెక్స్" గురుంచి కుడా మాట్లాడుతారు ... అదే ఫాదర్ ... విక్కీ - స్పెర్మ్ డోనార్ అని తెలిసాక ఎంత బ్రాడ్ గా ఆలోచిస్తారో ... సింపుల్ గా చెబుతారు ...
రెండు కల్చర్ సెటప్ వలన ప్రేమ కధ ... మెల్లగా ... పెళ్లి కధ లోకి వెళ్తుంది ...
రెండు కల్చర్ మధ్య విరోధం కాస్త .. రిలేషన్ బలపడటం బాగుంది ...

8. Conflict creation :
విక్కీ స్పెర్మ్ డోనార్ --- విషయం మనకు తెలుసు ...
విక్కీ భార్య అషిమా కు పిల్లలు పుట్టక పోవడం (conflict )తో విక్కీ, అషిమా జంట మీద సానుభూతి వస్తుంది ...అందరి సమస్యలు తీరుస్తున్న విక్కీ కి ... అదే సమస్య ఎదురు కావడం .. అది విక్కీ అషిమా లను వేరు చేయడానికి దోహదం చేయడం బాగుంది ... దీనివలన కధ నేల మీదే వుండి ... చూడడానికి ఫీల్ వచ్చేలా చేసింది ...

1 comments:

Anonymous said...

chala bagundi. all the best to you.

Post a Comment